వద్దన్నా, ఫ్రీ గా ఎక్కడబడితే అక్కడ పంచుతున్నారట!

TDP Giving Money To Public

వద్దు.. వద్దు.. అంటున్నా బలవంతంగా జనాల చేతిలో పెడుతున్నారు తోక పత్రికను. పోలింగ్ కు సమయం ఆసన్నం అయిన వేళ తమ విషపుత్రికను ఎంతమందికి అందిస్తే అంత మంచిది అనుకుంటున్నట్టుగా ఉన్నారు. ఎలాగూ జనాలు ఆ పత్రికను కొనరనే విషయాన్ని గ్రహించి.. ఉచితంగా పంచుతూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో తోక పత్రిక ఉచిత పంపిణీ కొనసాగుతూ ఉంది.

పెట్రోల్ బంకులు ప్రధాన టార్గెట్ గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పెట్రోల్ బంకులోనూ వీటిని పెట్టి.. వచ్చి పోయే ప్రతి బైక్ కు, కారుకు ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అంటే సమాధానం లేదు. ఊరికే కారులో పడేసి వెళ్తున్నారు. ఆఖరికి తోక పత్రిక గతి ఇక్కడకు వచ్చింది.

అంతేకాదు.. సెలూన్లకు , అంగళ్ల వద్ద కూడా ఊరికే పత్రికను జారవేసి వెళ్లిపోతున్న వైనం కూడా వెలుగుచూస్తూ ఉంది. కరపత్రికను మించి తెలుగుదేశం పార్టీ భజన చేస్తూ, ప్రత్యర్థి మీద విషం చిమ్మే కథనాలను రాస్తున్న తోక పత్రికను జనాలు కొనకపోవడంతో.. చివరకు ఉచితంగా పంచి.. విష ప్రచారాన్ని ముమ్మరంగా చేసుకుంటున్నట్టుగా ఉన్నారు.

Share On Whatsapp