మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్!

malli reentry isthunna pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదే పదే ఓమాట చెబుతుంటారు. వందల కోట్ల ఆదాయం వచ్చే సినిమాలను వదులుకుని, రాజకీయాల్లోకి వచ్చాను అని. అయితే అలా అని అయిదేళ్లు సీరియస్ రాజకీయాలు చేయలేదు. పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడు అలా మెరుపులు మెరిసి వదిలారు.

అలాకాకుండా ఆయన అయిదేళ్లు సీరియస్ గా పార్టీ నిర్మాణం మీద దృష్టిపెట్టి వుంటే, అలాగే ప్రభుత్వాన్ని పూర్తిగా నిలదీసి వుంటే, నిజమైన ప్రతిపక్షం పార్టీగా జనం దృష్టిలో వుండి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. ఇప్పుడు వస్తున్న సర్వే రిపోర్టులు ఏవీ ఇలా వుండేవికావు.

సరే, అదంతా వేరే సంగతి. టాలీవుడ్ లో మాత్రం ఓ విషయం చాలా గట్టిగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఈ ఏడాదిలో వుంటుందని వినిపిస్తోంది. ఆయన ఫ్యావరెట్ బ్యానర్, ఆయన ఫ్యావరెట్ డైరక్టర్ కాంబినేషన్ లో సినిమా వుంటుందని తెలుస్తోంది. ఆ వ్యవహారం అంతా చాలా సైలంట్ గా, గుంభనంగా వుందని తెలుస్తోంది. ఎన్నికల పలితాలను బట్టి, ఈ వ్యవహారం బయటకు వస్తుంది.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ తను నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లు ఏవీ తిరిగి ఇవ్వలేదు. అవన్నీ అప్పులుగా తన ఎన్నికల డిక్లరేషన్ లో చూపించారు. తిరిగి ఇవ్వలేదు అంటే ఎప్పటికైనా సినిమా చేసే ఆలోచన వుందనే అనుకోవాలి. అందుకు తగినట్లే ఇప్పుడు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మళ్లీ ఫ్యూచర్ లో సినిమా సభల్లో పవన్ కనిపిస్తారని, పవర్ స్టార్ పవర్ స్టార్ అరుపులు వినిపిస్తాయని టాక్ వినిపిస్తోంది.

Share On Whatsapp