మన్మధుడు 2 లో నాగార్జునతో సమంత నటిస్తుందట!

Nagarjuna Upcoming Movie Manmathudu 2

నటుడు రాహుల్ రవీంద్రన్ ‘మన్మథుడు-2’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాని మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. అయితే ముందునుంచి ఈ సినిమాలో రెండవ హీరోయిన్ కు ఛాన్స్ ఉందని చిత్ర బృందం చెప్తూనే ఉన్నారు. కానీ ఆ హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు తేల్చలేదు.

అయితే కొన్ని రోజుల క్రితం నాగ్ సరసన ‘మన్మథుడు-2’లో సెకండ్ హీరోయిన్‌గా ‘ఆర్‌ఎక్స్‌ 100’ తో గ్లామర్ డాల్ గా ఓవర్ నైట్ పాపులారిటీని సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్ నటిస్తుందని కూడా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్ చేసింది. కానీ ప్రస్తుతం పాయల్ ‘మన్మథుడు-2’ నటించడంలేదని తెలుస్తోంది. వెంకటేష్, రవితేజ సినిమాలతో బిజీగా ఉన్న పాయల్ ఇటీవల సి. కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్‌గాను నటిస్తోంది. అంతేకాదు ఐటం సాంగ్స్ కి రెడీ అంటూ కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటిస్తున్న ‘సీత’ సినిమాలో అద్ధిరిపోయో మాస్ సాంగ్ లో నర్తించింది.

సో ఇంత బిజీగా ఉన్న పాయల్ మన్మథుడికి డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిందా..? అవుననే ఫిల్మ్ నగర్ టాక్. అందుకే నాగ్ సరసన సెకండ్ హీరోయిన్ గా సమంత నటించనుందని టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఇంతవరకు మనం, రాజుగారి గది-2 చిత్రాలలో నాగ్, సమంత కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సమంత ‘మన్మథుడు-2’లో తన మామ నాగ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుందట. అయితే ఈ సారి కూడా ఓ ముఖ్యమైన పాత్రే కాని హీరోయిన్ మాత్రం కాదని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించాల్సి ఉంది.

Share On Whatsapp