తాత కాబోతున్న అక్కినేని నాగార్జున!

nagarjuna becoming grandfather soon

టాలీవుడ్ కింగ్ నాగర్జున త్వరలో తాత కాబోతున్నాడు కంగారు పడకండి నిజజీవితంలో కాదు వెండితెరపై. ప్రస్తుతం మన్మధుడు సీక్వెన్స్ సినిమా చేస్తున్నాడు నాగార్జున. గతంలో తన కెరియర్ లో వచ్చిన మన్మధుడు సినిమా తెలుగు అమ్మాయిల హృదయాలను ఎంతగానో దోచుకున్న విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా మన్మధుడు నాగార్జున కెరీర్లోనే అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు.

ఆ సినిమాలో నాగార్జున వేసిన సెటైర్లు ఇప్పటికీ కూడా టీవీలో వస్తే చూస్తుంటే నవ్వు ఆపుకోవడం కష్టం. దీంతో ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్న నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా మూడేళ్ల క్రితం నాగార్జున హీరోగా..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా చేయనున్నాడు నాగ్.

ఈ సినిమా ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందట. ఇందులో నాగ చైతన్యకి తాతగా నాగ్ కనిపించనున్నాడట. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తాయని అంటున్నారు. ఇప్పటికే చైతూ- నాగ్ కలిసి మనం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం సాధించింది.అయితే రీల్ లైఫ్‌లో నాగ్ తాత అవ్వడం వరకు ఓకే. మరి నిజంగా నాగార్జున తాత ఎప్పుడు అవుతారు అనే ప్రశ్నలు కూడా అక్కినేని అభిమానులు ఈ సందర్భంగా వేస్తున్నారు. మొత్తం మీద మరొకసారి నాగచైతన్య నాగార్జున కలిసి మనం తరహాలో నటిస్తున్న క్రమంలో ఈ న్యూస్ అక్కినేని అభిమానులకు బంపర్ న్యూస్ అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు.

Share On Whatsapp