పెళ్ళికి ముందే సామ్ తో తొందరపడ్డ చైతు!

pelliki mudhay sam to thondharapadda chythu

రేపు విడుదల కానున్న మజిలీ మీద అభిమానులకు ఎన్ని అంచనాలు ఉన్నాయో కానీ భార్యాభర్తలుగా నటిస్తున్న చైతు సామ్ లు మాత్రం యమా టెన్షన్ గా ఉన్నారు. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉన్నప్పటికీ థియేటర్ లో నుంచి బయటికి వస్తున్న ప్రేక్షకులు ఆ మాట చెబితేనే వసూళ్ల గురించి నిశ్చింతగా ఉండొచ్చు. అందుకే ఇంకొన్ని గంటలు వేచి ఉండక తప్పదు.

ఇకపోతే పెళ్ళైన ఓ జంట మధ్య సాగే ఎమోషనల్ జర్నీగా దీని గురించి ఒక అవగాహనా వచ్చేలా ట్రైలర్ కట్ చేసిన యూనిట్ కీలకమైన ఓ విషయాన్నీ మాత్రం సస్పెన్స్ లో ఉంచిందట. దాని ప్రకారం ఇందులో చైల్డ్ ఎపిసోడ్ కూడా ఉంటుందని వినికిడి. చైసామ్ లకు పుట్టిన ఓ బిడ్డకు సంబంధించిన ట్రాక్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో చూపిస్తారట. అక్కడే కథ హెవీ టర్న్ తీసుకుంటుందని అంటున్నరు

ట్రైలర్ లో చూస్తేనేమో చైతు సాంలు వేసిన పూర్ణ శ్రావణి పాత్రలు ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో చైల్డ్ అంటున్నారు. ఎక్కడో డౌట్ కొడుతోంది కదూ. అయితే ఫ్లాష్ బ్యాక్ లో సాంతో లవ్ ట్రాక్ లో ఉన్నప్పుడే చైతు తొందరపడి ఉంటాడని తనతో బ్రేకప్ అయ్యాక ఇంకో హీరొయిన్ ప్రేమలో పడతాడని ఏవేవో చెబుతున్నారు. ఇదంతా నిజమో కాదో కాని మొత్తానికి కంటెంట్ అయితే చాలా ఉందనే క్లారిటీ వచ్చింది. మ్యూజికల్ గా ఇప్పటికే డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్న మజిలి రేపు కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పోటీ లేని డ్రై సీజన్ లో మంచి ఛాన్స్ దొరికినట్టే

Share On Whatsapp