చందమామ నేలమీదకి వచ్చిందంట!

Kajal Upcoming Movie

కాజల్ అంటేనే అందాల చందమామ. ఆమె తొలి చిత్రం లక్ష్మీ కళ్యాణం హిట్ కాకపోయినా చందమామ తీసి ఆమెతో వెండితెరపై వెన్నెల కాంతులు కురిపించాడు డైరెక్టర్ క్రిష్ణ వంశీ. అలా నింగిలోనే ఉంటూ ఎన్నో విజయాలు అందుకుంది కాజల్. ఇక కాజల్ అంటేనే యూత్ లో ఓ క్రేజ్ ఇప్పటికీ ఉందన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, చందమామ కాజల్‌కు ఈమధ్య పెద్దగా సక్సెస్‌లు దక్కడంలేదు. మెగాస్టార్‌తో చేసిన ఖైదీ నెం 150 సక్సెస్ తరువాత కాజల్ నటించిన సినిమాలన్నీ వరుస పరాజయాలు అందుకోవడంతో అమ్మడికి కొత్త అవకాశాలు కరవయ్యాయి. అటు తమిళంలో పరిస్థితీ అలాగే ఉంది. ఈమధ్యే కుర్ర హీరో బెల్లకొండ శ్రీనివాస్‌తో చేసిన కవచం అట్టర్ ఫ్లాప్ అయినా, మళ్లీ అదే హీరోతో కలిసి సీత సినిమా చేస్తుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా త్వరలో విడుదల కానుంది.

ఇక ఈ అమ్మడు తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ సరసన నటించేందుకు ఓకె చెప్పింది. యాక్షన్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న గోపీచంద్ పరిస్థితీ అలాగే ఉంది. ఈమధ్య ఆయనకూ వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. దాదాపు అరడజను సినిమాల దాకా అదే పరిస్థితి. ఈ పరిస్థితిలో మార్పుకోసం గోపీ కొత్త దర్శకులతో ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న ఆయన తాజాగా బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు.

స్క్రిప్ట్ వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఇందులో హీరోయిన్‌గా అందాల భామ కాజల్‌ని ఎంపిక చేశారు. గోపీచంద్‌తో కాజల్ నటిస్తున్న మొదటి సినిమా ఇదే. మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా కాజల్ ఒకపుడు స్టార్ హీరోయిన్. అవకాశాలు లేక ఇపుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకుంటోందని టాక్ నడుస్తోంది. కాజల్ మొత్తానికి నేలకు దిగిన చందమామ అని అంటున్నారు

Share On Whatsapp