విడాకులు తీసుకుంటున్న ఆ టాప్ హీరోయిన్!

vidakulu theesukuntunna aa top heroine

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా దంపతులు విడాకులు తీసుకుంటున్నారని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దాంతో శిల్ప అభిమానులు, సన్నిహితులు ఈ విషయమై చాలా కంగారుపడ్డారు. తీరా చూస్తే ఇది బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ బసు ప్రాంక్‌ అని తెలిసింది. అసలేం జరిగిందంటే.. శిల్ప, అనురాగ్‌ బసు, గీతా కపూర్‌లు ‘సూపర్‌ డ్యాన్సర్‌ 3’ అనే డ్యాన్స్‌ రియాల్టీ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనురాగ్‌ శిల్పకు తెలీకుండా ఆమె ఫోన్‌ తీసుకుని ‘నేను, రాజ్‌కుంద్రా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం’ అని ఆమె తల్లి సునంద శెట్టికి సందేశం పంపారు. దాంతో శిల్ప కుటుంబ సభ్యులు కంగారుపడిపోయారు. ఆమె తల్లి ఫోన్‌ చేసి ‘ఇదంతా నిజమేనా?’ అని అడిగారు.

ఆ తర్వాత శిల్పకు గీతా కపూర్‌ అసలు విషయం చెప్పారు. ఇదంతా అనురాగ్‌ బసు చేసిన నిర్వాకం అని, దాంతో శిల్ప వెంటనే తన తల్లికి ఫోన్‌ చేసి ‘అదేం లేదమ్మా. ఏదో జస్ట్‌ జోక్‌ చేశారంతే. నాకు నేనుగా ఇంటికి వచ్చి ఇలాంటి విషయాలు చెప్పే వరకు నువ్వు నమ్మొద్దు’ అని శిల్ప చెప్పారట.

దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని శిల్ప ఓ బాలీవుడ్‌ మీడియా వర్గం ద్వారా వెల్లడించారు. శిల్ప, రాజ్‌కుంద్రా 11 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.

Share On Whatsapp