అందుకే ఆ పదవిని వదిలేస్తున్న రోజా!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో.. బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరై సదరు ఛానెల్ యాజమాన్యానికి అంతులేని టీఆర్పీ రేటింగ్ తెచ్చిన ఏకైక షో ఇది. యాంకర్స్ మొదలుకొని స్కిట్లు చేసేవారు, న్యాయనిర్ణేతలు అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వించే వారే. మరీ ముఖ్యంగా జడ్జి స్థానంలో కూర్చొని పకపకా నవ్వేస్తూ ఆ నవ్వుతోనే బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టడంలో నాగబాబు, రోజా దిట్ట. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైతే ఎన్నికల హడావిడి మొదలైందో అప్పటి నుంచి ఈ జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో కల తప్పింది. దీంతో నిరాశగా ఉన్న ఆడియన్స్ కి తాజాగా మరో వార్త ఇబ్బంది పెడుతోంది. రోజా గుడ్ బై జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో న్యాయనిర్ణేత స్థానం నుంచి రోజా పర్మనెంట్ గా తప్పుకోనుందని సమాచారం.

ఇన్నాళ్లు ఇటు రాజకీయాల్ని, అటు జబర్దస్త్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన రోజా ఇక జబర్దస్త్ కి సెలవు అని చెప్పనుందట. ప్రస్తుతం ఈ ఇష్యుపై బాగా చర్చలు సాగుతున్నాయి. రెండోసారి ఎమ్మెల్యేగా ఇటీవల రాజకీయ సంబంధమైన కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన రోజా.. ఎన్నికల ఫలితాలతో ఫుల్ ఖుషీ అయింది. రెండోసారి నగరి ఎమ్మెల్యేగా రోజా ఎన్నుకోబడింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలవడం, అందులో రోజా కూడా ఒకరుగా ఉండటంతో ఇక ఆమె జబర్దస్త్ షో లో కనిపించడం జరిగే పని కాదని అంటున్నారు ఆమె సన్నిహితులు.

రోజాకి మంత్రి పదవి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రోజాకి పొలిటికల్ గా బాధ్యతలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి కానున్న నేపథ్యంలో జగన్ కేబినెట్‌లో ఆమెకు మంత్రి పదవి దక్కడం ఖాయం అని తెలుస్తోంది. ఇదే జరిగితే రాజకీయ ఒడిలో బిజీగా ఉండే ఆమె జబర్దస్త్ షో వంక చూసే అవకాశం గానీ, సమయం గానీ ఉండదు. వదిలేయక తప్పదు ప్రస్తుతం వైసీపీ మహిళా రాజకీయ నాయకుల్లో రోజానే కీలకమైన వ్యక్తి. పైగా జగన్ కి బాగా సన్నిహితురాలు కూడా. కాబట్టి జగన్ పెద్ద బాధ్యతనే ఈమె బుజాలపైనా వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోజా జబర్దస్త్ అని కూర్చుంటే కుదరదు కదా! అందుకే ఆమె జబర్దస్త్ వదలక తప్పదు అనే టాక్ వినిపిస్తోంది.

Share On Whatsapp