ఎమ్మెల్యేలనే డబ్బులు అడుగుతున్నారట!

 సినీ పరిశ్రమ ఎంతో సున్నితమైనది. ఇక్కడ ఒకసారి ఏదైనా ఒకరిపై నెగెటివ్ టాక్ వచ్చిందంటే చాలు  ఎంత పెద్ద ఆర్టిస్టు అయినా పక్కన పెట్టేస్తుంటారు. క్యారెక్టర్ లాస్ అయినా.. షార్ట్ టెంపర్ చూపించినా.. సమయపాలన లేకుండా ఉన్నా.. లేడీ ఆర్టిస్టుల విషయంలో తేడాగా కనిపించినా ఇక ఆ ఆర్టిస్టు పని అంతే. అదొక్కటే కాదు.. ఎవరైనా ఆర్టిస్టు వల్ల షూటింగ్ ఏమాత్రం డిస్ట్రబ్ అయినా అతడికి మరో అవకాశం ఇవ్వడం చాలా కష్టం!! ఒకరి వల్ల రోజంతా షూటింగ్ నష్టపోవాల్సిన సన్నివేశం దాపురిస్తుంది. ఈ విషయంలో ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు చాలా అలెర్టుగా ఉంటున్నారన్నది ఓ సీనియర్ విశ్లేషణ. ఒదిగి ఉంటేనే పరిశ్రమలో అవకాశాలుంటాయి. అది ఆర్టిస్టులు అయినా.. లేదా ఇతర శాఖల్లో అయినా. చివరికి అసిస్టెంట్ డైరెక్టర్లు సైతం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు పది వేల కోట్లు ఖర్చు పెట్టారని.. తనకు వ్యక్తిగతంగానే 50 కోట్ల వరకు ఖర్చు వచ్చిందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బాంబు పేల్చారు.. అలాగే ఓటర్లు 2 వేల ఇస్తే సంతృప్తి చెందడం లేదని.. 5 వేలు అడుగుతున్నారని ఇలా వచ్చే ఎన్నికల్లో కష్టమేనని జేసీ చేసిన వ్యాఖ్యలు అటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.. ఎన్నికల నిబంధనల ప్రకారం జేసీ మాట్లాడింది తప్పా ఒప్పా అనేది పక్కనపెడితే.. జేసి కరెక్ట్ గా మాట్లాడాడు రా అంటూ కొందరు  ఎమ్మెల్యేలు కూడా అనుకుంటున్నారట.

ఈ సంగతి ఇలా ఉంచితే.. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు గా పోటీ చే్సిన వారి ఇళ్లకు కొందరు ఓటర్లు బార్లు తీరుతున్నారటప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్కు ముందురోజు వరకు కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు పంచగాపోలింగ్ రోజున కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు నోట్లిచ్చారు. ఈ డబ్బుల పంపిణీ సమయంలో ఇళ్లల్లో లేనివారిలో కొంతమంది పోలింగ్ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులను కలిశారట. “మేము మీకే ఓటేశాం. డబ్బులు ఇవ్వాలిఅని అడిగారట. ఈ పరిణామంతో ఆయా నేతల నోట మాట రాలేదట. గుంటూరుకృష్ణాజిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయట.. డబ్బులు పంపిణీ చేసే సమయంలో మేము లేము. ఆ తర్వాత వచ్చాం. మా ఓటు మీకే వేశాంఅని చెప్పి డబ్బులు అడిగే కొత్త సంస్కృతి ఈ ఎన్నికల్లోనే మొదలైందని కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు వాపోతున్నారట
www.lakshmicollection9.com
ఈ నేపథ్యంలో తమ దగ్గరికి వచ్చిన వారు ఏ పార్టీకి ఓటేశారో తెలుసుకునేందుకు స్థానిక నేతలను సంప్రదిస్తున్నారట. వారు ధ్రువీకరించిన తర్వాతే సదరు వ్యక్తులకు అభ్యర్థులు డబ్బులిస్తున్నారట. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ కు సిద్ధమైన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఓటును అమ్ముకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. మరో వైపు కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిశాక కూడా ఓటర్లు ఏ పార్టీకి ఓట్లేశారో తెలుసుకుని కొంతమంది అభ్యర్థులు ఓటర్లకు  డబ్బులు పంపిణీ చేశారట.. ఇదండీ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఓటర్లు డబ్బు తీసుకోవడం మా హక్కు అనేలా ఎమ్మెల్యే అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారట

Share On Whatsapp