పవన్ ఫాన్స్ ఉద్దేశించే ఆ మాట అన్నాడట!

క్రికెట్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఎమోషన్స్ ని మిక్స్ చేస్తూ ఫాదర్ సెంటిమెంట్ థ్రెడ్ మీద దర్శకుడు గౌతం తిన్ననూరి తీసిన జెర్సీ వల్ల నానికి ఏడాది గ్యాప్ తర్వాత సూపర్ సక్సెస్ వచ్చేసింది. ఈ నమ్మకాన్ని ముందు నుంచి టీం వ్యక్తం చేస్తూ వచ్చినప్పటికీ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ మాత్రం సైలెంట్ గా ఉంటూ వచ్చాడు.

https://lakshmicollection9.com/product-category/silk-sarees/brasso-sarees/

టాలీవుడ్ లో తన మొదటి సినిమా అజ్ఞాతవాసి టైంలో ఏవేవో వీడియోలు చేసి హంగామా చేసి సోషల్ మీడియా అటెన్షన్ తన వైపు ఉండేలా చేసుకున్న అనిరుద్ జెర్సీ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటూ వచ్చాడు. ఆడియో రిలీజయ్యాక కూడా పెద్దగా స్పందన రాలేదు. జస్ట్ ఓకే ఆల్బం అనే ఫీడ్ బ్యాక్ తప్ప మ్యూజిక్ లవర్స్ మరీ ఎగ్జైట్ అవ్వలేదు. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది 


https://lakshmicollection9.com/


పాటల కన్నా ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీన్నే ప్రస్తావిస్తూ నిన్న అనిరుద్ తన ట్విట్టర్ లో నా పని అయిపోయింది అనుకున్నారా అంటూ సెటైరిక్ గా ఓ వీడియో పెట్టిన సంగతి తెలిసిందే. అది ఎవరిని ఉద్దేశించి పెట్టాడా అనే కోణం అభిమానులు నానా రకాల అర్థాలు తీశారు.

http://lakshmicollection9.com/product/uppada-pattu-big-border-pink-and-orange-saree-with-blouse/

అజ్ఞాతవాసి టైంలో తనను ట్రాల్ చేసిన పవన్ ఫ్యాన్స్ ని అని కొందరు అంటుండగా కాదు తన వర్క్ ని అనుమానించిన త్రివిక్రమ్ ను ఉద్దేశించి అని మరొకొందరు అభిప్రాయపడ్డారు. ఏది నిజమో కాని ఒక్క సినిమాకే అనిరుద్ పనైపోయింది అని ఇక్కడ ఎవరూ అనుకోలేదు. మరి అనిరుద్ ఆ మాట నొక్కి చెప్పాడు అంటే ఏదో జరిగిందనే కదా అర్థం. బహుశా అరవింద సమేత వీర రాఘవతో పాటు బన్నీ సినిమాకు తనను పరిగణనలోకి తీసుకోలేదని ఈ రకంగా కౌంటర్ ఇచ్చాడానా. ఏమో లోగుట్టు పెరుమాళ్ళకెరుక

Share On Whatsapp