తారక్ అందుకే ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదట!

thark adukay enikala pracharniki vlladam laydhata

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎంతగా వేడెక్కిపోయాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణలో తెలంగాణ అధికారపక్షం తప్పించి.. విపక్షం నామా మాత్రంగా ఉండటంతో వార్ వన్ సైడ్ గా మారింది. టీఆర్ ఎస్ కోరుకున్నట్లు 16 సీట్లు గెలుచుకోవటం తప్పించి.. వారి ముందు మరెలాంటి టాస్క్ లేదు. ఒకట్రెండు తగ్గినా లైట్ తీసుకోమంటే టీఆర్ ఎస్ కు మించిన హ్యాపీ పార్టీ మరొకటి ఉండదు.

దీనికి భిన్నమైన వాతావరణం ఏపీలో నెలకొంది. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ ఇద్దరూ పోటాపోటీగా ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతుండగా.. వారితో పోటీకి జనసేన దిగటం తెలిసిందే. ఎన్నికలకు ముందు జనసేన బలం మీద ఉన్న అంచనాలు తప్పన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఈ రాజకీయాల సంగతి ఇలా ఉంటే.. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో సినీ నటుల్ని ఎన్నికల ప్రచారానికి వాడే విషయంలో పార్టీలు ప్రయత్నించినా.. కొందరు తప్పించి.. చాలామంది సైడ్ గానే ఉన్నారు. మెగా కుటుంబానికి మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ తరఫున ప్రచారానికి దిగారు. కానీ.. వారంతా నామమాత్రంగా ప్రచారం చేసి తమ దారిన తాము వెళుతున్నారు.

వీరందరికి భిన్నంగా ఒకరు మాత్రం ఫుల్ హ్యాపీగా.. కూల్ గా ఉన్నారని చెప్పాలి. అతడే తారక్. 2009 ఎన్నికల వేళలో ప్రజారాజ్యం దెబ్బతో జూనియర్ ను తెర మీదకు తెచ్చిన చంద్రబాబు.. ఆయన్ను ప్రచారానికి వాడారు. అయితే.. రోడ్డు ప్రమాదంతో తారక్ మధ్యలోనే తన ప్రచారాన్ని ముగించాడు.

ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరి బరిలో ఉన్నా ప్రచారానికి నో అంటే నో చెప్పేశారు. 2009 ఎన్నికల తర్వాత తన తండ్రికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై తారక్ గుర్రుగా ఉన్నారని..తండ్రి మరణం తర్వాత బాబు తనతో రాజీ చేసుకునే ప్రయత్నం చేసినా.. మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోకి తారక్ ను దించే ప్రయత్నం చేసినా.. ఆయన పాజిటివ్ గా రియాక్ట్ కాలేదని చెబుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల హీట్ ను దూరం నుంచి చూస్తూ తారక్ మాత్రం కూల్ గా ఉంటున్నారన్న మాట వినిపిస్తోంది.

Share On Whatsapp