సుకుమార్ కి హ్యాండ్ ఇచ్చిన బన్నీ!

sukumaar ki hand ichina bunny

గత ఏడాది రాంచరణ్, సమంత జోడీగా ప్రముక దర్శకులు సుకుమార్ ‘రంగస్థలం’లాంటి బ్లాక్ బస్టర్ తీసిన విషయం తెలిసిందే. 1983 నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రం తీశారు. రాంచరణ్ నటన ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాంటి సుకుమార్ ఇప్పుడు స్టార్ హీరోలతో ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రిన్స్ మహేష్ తో 1-నేనొక్కడినే చిత్రం తీశారు సుకుమార్. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఇటీవల మహేష్ తో ఓ చిత్రానికి ప్లాన్ చేశాడు సుకుమార్. ఎర్రచందనం బ్యాగ్డ్రాప్ ఉన్న కథతోనే చిత్రం చెయ్యాలనుకున్నాడు. కానీ ఈ కథ మహేష్ కి అంతబాగా నచ్చకపోవడంతో సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత సుకుమార్ తో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉండొచ్చని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు బన్నీకి సుకుమార్ చెప్పిన కథ మీద అనుమానాలు మొదలయ్యాయని సమాచారం. బన్నీ సన్నిహితుడు సుకుమార్ చెప్పిన కథలాంటి హాలీవుడ్ చిత్రం డీవీడీ ఒకటి బన్నీ చేతికిచ్చి చూడమనగా.. సుకుమార్ చెప్పిన కథకి ఆ హాలీవుడ్ చిత్రానికి పోలికలున్నాయట.

దాంతో అల్లు అర్జున్ కి కొత్త అనుమానాలు రావడంతో కొత్త కథతో అయితే ఓకే అన్నట్లు ఫిలిమ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే..స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయించబోతున్నట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ కి కొత్త కథ తీసుకు వస్తే ఆలోచిద్దాం అని.. కథ విషయంలో కంగారేం లేదని చెప్పడంతో వీరి సినిమాపై అనుమానాలు వస్తున్నాయి.

Share On Whatsapp